![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు' (Guppedantha Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1131 లో....బుజ్జి సరోజ కలిసి పెళ్లిచూపులు చెడగొట్టడానికి ప్లాన్ చేస్తారు. బుజ్జి పెళ్లి వాళ్లు వచ్చే దార్లో ఉంటాడు. శైలేంద్ర, ధనరాజ్, దేవయానిలు వచ్చే కార్ ఆపుతారు. సరోజ నేను లవర్స్ అని బుజ్జి చెప్తాడు. ప్రూఫ్ అంటూ సరోజ రంగాతో ఉన్న ఫోటోని వాళ్లకు చూపించగానే.. రంగాని చూసి దేవయాని, శైలేంద్రలు షాక్ అవుతారు. ఎవరు అతనని శైలేంద్ర అంటాడు. సరోజ బావ రంగా అని బుజ్జి చెప్పగానే.. పదండి ఇక ఈ సంబంధం కూడా క్యాన్సల్ అయినట్లే అని ధనరాజ్ అంటాడు.
ఆ తర్వాత అసలు ఎవరు ఈ రంగా.. రిషి లాగే ఉన్నాడు. ఒకవేళ రిషినే కావచ్చని దేవయాని అనగానే.. చనిపోయిన వాడు ఎలా వస్తాడని శైలేంద్ర అంటాడు. పోలీసులు చెప్పారు అంతే గానీ మనకి తెలియదు జదా అని దేవయాని అంటుంది. సరే ఒకసారి వెళ్లి చూద్దామని దేవాయని అంటుంది. ధనరాజ్ ఇక వెళదామని అనగానే.. ఒరేయ్ ఎందుకు రా? వాడు చెప్పేది నిజమో అబద్దమో తెలియదు కదా వట్టిగ బంగారం లాంటి సంబంధం క్యాన్సిల్ చేసుకుంటావా? పదా చూద్దామని ధనరాజ్ ని దేవయాని దబాయిస్తుంది. దాంతో సంజీవయ్య ఇంటికి బయల్దేరతారు. ఆ తర్వాత ఈ విషయం సరోజకి చెప్పాలని బుజ్జి తొందరగా తన దగ్గరికి వెళ్తాడు. పెళ్లి చూపులు ఎలాగూ క్యాన్సిల్ అయిపోతాయనే ధీమాతో సరోజ ఉంటుంది. పెళ్లిచూపులకు వస్తున్నారని బుజ్జి చెప్పగానే.. ప్లాన్ ఫెయిల్ చేసావ్.. మనం ప్రేమించుకుంటున్నామని చెప్పి బావది నా ఫోటో చూపిస్తే.. వాళ్లకు డౌట్ రాదా అని బుజ్జిపై సరోజ కోప్పడుతుంది.
ఆ తర్వాత పెళ్లిచూపులకి శైలేంద్ర వాళ్ళు రాగానే.. సంజీవయ్య లోపలికి రండి అంటూ పిలుస్తాడు. ఆ తర్వాత దేవయాని, శైలేంద్ర ఇద్దరు రంగా గురించి చూస్తుంటారు. పెళ్లి కూతురికి రంగా అనే బావ ఉన్నాడట కదా అని దేవయాని అంటుంది. ఉన్నాడు అత్తయ్య.. మీరు రంగాకి ఫోన్ చేసి రమ్మని చెప్పండని సంజీవయ్య రాధమ్మకి చెప్తాడు. మరొకవైపు ఇప్పుడు పెళ్లిచూపులకి ఎందుకని రంగాతో వసుధార అనగానే.. సరోజకి నాకు మధ్యలో ఏం లేదని అక్కడ చెప్పాలని రంగా అంటాడు. అప్పుడే రాధమ్మ ఫోన్ చేసి.. రంగాని రమ్మని చెప్తుంది. ఆ తర్వాత రంగా, వసుధారని బయట నిలబెట్టి.. లోపలికి వెళ్తాడు. శైలేంద్ర, దేవయానిలు రంగా మని చూసి భయపడుతుంటారు. ఏంటి ఏసీ లేదు.. వణికిపోతున్నారని రంగా అంటాడు. కార్ లో వస్తుంటే ఏసీ ఉండేదని దేవయాని అంటుంది. ఆ మాట బయటున్నా వసుధార విని.. ఈ వాయిస్ ఎక్కడో విన్నానంటూ లోపలకి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |